27 July, 2026 | 7:49 PM

Breaking News

మండల సమావేశాన్ని బహిష్కరించిన ఫీల్డ్ అసిస్టెంట్లు   •   దోరకుంటలో వన మహోత్సవం   •   చిన్నకాపర్తి చెరువులకు పిలాయిపల్లి కాలువ నీరు అందించాలి   •   ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం   •   మూడేళ్లుగా కూలిన హాస్టల్ గోడ.. పునర్నిర్మించాలని పీడీఎస్‌యూ డిమాండ్   •   దళితుడిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి   •   సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా చేతికి రీసెంట్ బ్లాక్‌బస్టర్ 'చెన్నై లవ్ స్టోరీ' డిజిటల్, శాటిలైట్ హక్కులు   •   రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుతో లబ్ధి పొందాలి   •   ఆర్థిక సాయం అందించిన టూ వీలర్ మెకానిక్ వర్కర్స్ యూనియన్   •   అశ్వాపురంలో గంజాయి పట్టివేత   •  

రైతులను మోసం చేసిన ఇద్దరు వ్యక్తులు రిమాండ్

02-06-2026 09:44 PM

ఉట్నూర్,(విజయ క్రాంతి): ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగ గ్రామానికి చెందిన  గిరిజన రైతులను ఎర్రచందనం మొక్కల సరఫరా పేరుతో మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్  మడవి ప్రసాద్  తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన తన్నీరు హేమంత్ కుమార్, ముద్దిరాల ఆనంద్  లు ఇంద్రవెల్లి మండలం డోంగర్గావ్ గ్రామానికి చెందిన  పలువురు గిరిజన రైతుల వద్దకు వచ్చి  ఎర్రచందనం మొక్కలు సాగు చేస్తే లాభాలు ఎక్కువ ఉంటాయని నమ్మించి వారి వద్ద రూ.5.20 లక్షలు తీసుకొని  మొక్కలు సరఫరా చేయకుండా  పారిపోయారని అన్నారు.

ఎర్రచందనం మొక్కలతోపాటు  మొక్కల రక్షణకు  ఫెన్సింగ్ వైర్, సీసీటీవీలో ఏర్పాటు చేస్తామని  రైతులను వారు నమ్మించారు. రైతులను నమ్మించి రెండేళ్ల పాటు మొక్కలు సరఫరా చేయకుండా  రైతులను తిప్పుకున్నారని ఎస్సై వివరించారు. ఎర్రచందనం మొక్కల పేరుతో మోసం చేసిన రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి  వారిని తిరుపతిలో అరెస్టు చేసి తీసుకువచ్చామని  సీఐ తెలిపారు. తిరుపతి నుండి తీసుకొచ్చిన ఇద్దరు వ్యక్తులను ఉట్టోర్ కొడుకు రిమాండ్ చేసినట్లు  సీఐ తెలిపారు. ఆయనతోపాటు ఎస్సై సాయన్న , పోలీసులు పాల్గొన్నారు.