2 June, 2026 | 10:24 PM

ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి

02-06-2026 09:46 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని తాళ్లగొమ్మూరు రైతు వేదికలో మంగళవారం ఉప సర్పంచ్‌ల సమావేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉప సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు మహంకాళి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఉప సర్పంచ్‌లకు ప్రస్తుతం అమలులో ఉన్న చెక్ పవర్‌ను కొనసాగించాలని, అలాగే ఉప సర్పంచ్‌లకు నెలకు కనీస వేతనం రూ.5,000, వార్డు సభ్యులకు రూ.3,000 చొప్పున అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పాత్ర కీలకమని, వారి సేవలకు తగిన గుర్తింపు కల్పిస్తూ ఆర్థిక భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.