కొల్లాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
27-02-2026 10:14 AM
కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామ శివారులో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వనపర్తి నుంచి తిరుగు ప్రయాణంలో వస్తున్న బైక్, లక్ష్మీదేవి అమ్మ గుట్ట మలుపు వద్ద ముందుకు వెళ్తున్న గడ్డి ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చుక్కాయిపల్లికి చెందిన బింగి ఉషన్న యాదవ్ (58), కొల్లాపూర్‌కు చెందిన సమ్మద్ (40) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఢీకొన్న తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో సింగోటం గ్రామ పరిసరాల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి.




