27 February, 2026 | 1:49 PM

మెడికల్ షాప్ లోకి దూసుకెళ్లిన లారీ

27-02-2026 10:16 AM

చిట్యాల,(విజయక్రాంతి): అదుపుతప్పి లారీ రహదారి పక్కన ఉన్న మెడికల్ షాప్‌లోకి దూసుకెళ్లిన ఘటన నార్కట్పల్లిలో చోటు చేసుకుంది. గురువారం నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని నల్లగొండ క్రాస్ రోడ్డులో(Nalgonda cross road) రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారి సంఖ్యపై పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, వేగంగా వస్తున్న లారీ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన నల్లగొండ చౌరస్తాలో ఉన్న దీపక్ మెడికల్ షాప్‌ను ఢీకొట్టి లోపలికి చొచ్చుకుపోయింది. ప్రమాద సమయంలో షాప్‌లో కొంతమంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.