కోతి చేష్టలకు ఇక చెల్లు
- కొత్త పాలకవర్గం ప్రధాన ఎజెండా ఇదే
మున్సిపల్ ఎన్నికల హామీ అమలుకు చర్యలు ముమ్మరం
నిర్మల్, ఫిబ్రవరి ౨౬ (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లా కేంద్రంలో కోతి చేష్టలకు ఇక చెల్లుబాటు కానుంది. నిర్మల్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో కోతుల సంచారం ప్రజలను వ్యాపారులను భయభ్రాంతులకు గురి చేయగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ కోతుల ఎరివేత హామీ ఇచ్చారు. నిర్మల్ పట్టణంలో మొత్తం 42 వార్డులు ఉండగా అందులో 12 వార్డులు శివారు ప్రాంతాలే కావడం గుట్టలు ఉండడం, చెట్లు పెద్ద పెద్ద బండరాలు మధ్యన చెరువులు పాడుబడ్డ భవనాలు ఉండడంతో అవి కోతులకు ఆవాసాలుగా మారాయి.
దీంతో ప్రతిరో జు కోతుల మంద రోళ్లపై తిరగడం ఇంట్లో ఉన్న ఆహార వస్తువులను అప్పరించకపోవడం మనుషులపై దాడి చేసి గాయపరచడం, కొండ దుకాణాలు వ్యాపార దుకాణంలో వస్తువులను చిందరవందరిగా చేయడం వంటివి మితిమీరి పోయాయి. పట్టణంలోని బొంగల్పె ట్. నాయుడు వాడ షేక్ సాయపెట్, గొల్లపేట్ ఆర్డిఓ ఆఫీస్ ఇంద్రనగర్ బాలాజీ వాడ సోముర్పేట్ గాంధీచౌక్ డాక్టర్ లైన్ రోడ్ తదితర ప్రాంతాల్లో వందలాది కోతులు ప్రతిని త్యం జనాలను భయ క్రంపితులను చేస్తున్నా యి.
ఇంటిపై ఉన్న కూన పెంకలను చంద్రబంద్ర చేయడం విద్యుత్ వైర్లను తెంపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో రోగులపై దాడి చేసి వారి వద్ద ఉన్న పనులు బెడ్ ప్యాకెట్లను దొంగిలించకపోతున్నాయి. చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్లేటప్పుడు టిఫిన్ బాక్సులు లాక్కెల్లుతున్నాయి పెడుతున్నాయి
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన ఎజెండా
నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల్లో ఏ వార్డుకి వెళ్లిన మా వార్డులో ఏ సమస్య ఎలా ఉన్నా ముందుగా కోతులను పట్టుతేనే ఓట్లు వేస్తామని ప్రజలు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. కోతుల వల్ల పడుతున్న ఇబ్బందులు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ లో అధికారం లోకి వచ్చిన నెల రోజుల్లోనే కోతులను పట్టి వేరే ప్రాంతాలకు తరలిస్తామని ప్రతి వార్డులో ప్రజలకు భరోసా ఇచ్చారు.
గతంలో కోతులు పట్టి వదిలేసిన ఘటనలను ప్రజలకు వివరించి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. దీంతో కాంగ్రె స్ పార్టీ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ మెజార్టీ కౌన్సిలర్ గెలుచుకోవడంతో ఇప్పుడు కోతులు పట్టే ఆపరేషన్ చర్యలు ప్రారంభించింది. కోతులకు నివాస అద్దాలుగా ఉన్న చెట్లను కొమ్మలను తొలగించడం కాకుండా కోతులను పట్టి పిల్ల లు పుట్టకుండా ఆపరేషన్ చేయించి వాటికి రంగులు వేసి సుదూర ప్రాంతాల్లో వదిలి పెట్టేందుకు మున్సిపల్ ప్రత్యేక కార్యచరణతో ముందుకు పోతుంది.
ఇప్పటికే మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణి చక్రవర్తి స్థానిక కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ అధికారులతో సమన్వయం చేసుకొని కోతులు పట్టే కార్యక్రమాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. కూతురు పట్టి వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకొని ఆపరేషన్ కోతులు నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో పట్టణంలో కోతుల బెడద నివారణ తీరని నుండి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీ
నిర్మల్ మున్సిపాలిటీలో తాము అధికారులకు వస్తే కోతులను ఎరివేస్తామని ఆయవార్డులో ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చాం. పట్టణంలో కోతుల బెడద కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రు వాటిని పట్టుకొని ఆపరేషన్ చేయించి పట్టుకున్న పూతలకు కలర్ వేసి వేరే ప్రాం తాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కోతులు నివాసముండే ఆవాస ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతా ల్లో కొండముచ్చులను ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య




