అన్నదాత ఆక్రోశం
వరి, జొన్న, మొక్క జొన్నను కొనాలి
- నిర్మల్ జిల్లాలో రోడ్డు ఎక్కిన రైతులు
- గుండంపెల్లి క్రాస్ రోడ్ వద్ద హైవేపై రాస్తారోకో
- 4 గంటల సేపు బైఠాయించిన 200 మంది రైతులు
- ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- ఆర్డీఓ, తహసీల్దార్, డీఎస్పీ, ఎస్సైల నిలదీత
నిర్మల్, మే6 (విజయ క్రాంతి): రైతులు పండించిన వరి, జొన్న, మొక్కజొన్న కొనుగోలు చేయాలని బుధవారం రైతులు ఆందో ళన నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలం గుండంపెల్లి క్రాస్ రోడ్ వద్ద బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై సు మారు 200 మంది రైతులు 4 గంటల సేపు బైఠాయించారు. ఉదయం 9 గంటల నుంచి ఒంటిగంట వరకు ఎండలు సైతం లెక్కచేయకుండా రైతులు పండించిన ధాన్యాన్ని కొను గోలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైతుల పండించిన పంట ను కల్లాల్లో పోసుకొని కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నామని, ఈ సమయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్డీ ఓ రత్నాకల్యాణి తహసీల్దార్ ఎజాస్ అహ్మ ద్, డీఎస్పీ ఎస్సైలు సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకోను విరమించేందు కు ప్రయత్నించారు. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు తమ ఆందోళన కొనసాగు తుందని రైతులు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, దాన్యం కొనుగోలను వెంటనే ప్రారంభించి, వేగంగా పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇవ్వడం తో రైతులు ఆందోళన విరమించారు.
మరోపక్క నిర్మల్ పట్టణంలోని మార్కెట్ కార్యాల యం ముందు వరి మొక్కజొన్నను కొనుగోలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు మారా గంగారెడ్డి, రైతు సంఘం నాయకులు తరలివచ్చి మద్ద తు పలికారు. కొనుగోలు ప్రారంభించి నెల రోజులైనా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోం దని నినాదాలు చేశారు.






