రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ముగ్గురికి గాయాలు, జహీరాబాద్ బైపాస్‌లో ప్రమాదం
జహీరాబాద్, మే 5 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్య క్తులు మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. జహీరాబాద్ అల్గో ల్ బైపాస్ వద్ద పస్తాపూర్ సర్వీస్ రోడ్డు కు వెళుతున్న క్రమంలో ఆగి ఉన్న టా టా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి కా రు ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు వ్య క్తులు మరణించారు. ఇందులో ఒకరు అక్కడికక్కడే మరణించగా, ఇంకొకరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మరణించారు.
తీవ్ర గాయాలైన మరొకరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. మిగిలిన ముగ్గురికి సాధారణ గాయాల య్యాయి. మృతి చెందిన వారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళకు చెందిన రోహిత్ గౌడ్, కాసుల మహేష్ గౌడ్‌గా గుర్తించారు. మరణించిన ఇద్దరి మృతదే హాలను జహీరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచారు. ఈ మేరకు జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ కె. వినయ్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.






