6 March, 2026 | 6:03 AM

కారు బైక్ ఢీకొని ఇద్దరు మృతి

06-03-2026 02:53 AM
  1. కేసు నమోదు చేసిన పోలీసులు

రేగొండ మండలం నారాయణపురం వద్ద ఘటన

మహబూబాబాద్, మార్చి 5 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం వద్ద కారు మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో ఇద్దరి యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

ఈ సంఘటనలో మహాదేవ పూర్ మండలం బొమ్మపూర్ గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి శ్రీమాన్ రెడ్డి (20), కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి అన్వేష్‌రెడ్డి (19) దుర్మర ణం పాలయ్యారు. భూపాలపల్లి నుంచి పరకాల వైపునకు వెళుతున్న కారు నారాయ ణపూర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు.