5 May, 2026 | 1:49 PM

Breaking News

పదవ తరగతిలో ప్రతిభ చాటిన శాలివాహన విద్యార్థులకు ఘన అభినందనలు   •   దేవరకొండ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌కు బీసీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం   •   వడదెబ్బతో బాలిక మృతి   •   మిషన్ భగీరథ నీరు సరిగా అందడం లేదు: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్   •   కన్నాలలో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం   •   రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు విస్తృతంగా నిర్వహించాలి   •   లింగుపల్లి ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   UAEపై దాడులు, భారతీయులకు గాయాలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన!   •   “ITP Aero – India” ప్లాంటుకు శ్రీధర్ బాబు శంకుస్థాపన   •  

బాలికపై సామూహిక లైంగిక దాడి

06-03-2026 02:51 AM
  1. ఉప్పనుంతల మండలంలోని ఓ గ్రామంలో ఘాతుకం  
  2. నిందితులపై పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు  
  3. నిందితుల్లో ఒకరు కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగి

అచ్చంపేట, మార్చి 5(విజయక్రాంతి): గిరిజన మైనర్ బాలికపై ఇద్దరు విచక్షణ మరచి అఘాయియిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పనుంతల మండలంలోని ఓ గ్రామంలో బుధవారం చోటు చేసుకోగా గురువారం వెలుగు చూ సింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకా రం గ్రామంలో కొద్ది రోజులుగా లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నా రు.

వేడుకల్లో భాగంగా ప్రతీ రోజు సా యంత్రం వేళా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిని తిలకించేందుకు స్థాని కులు, సమీప గ్రామాల ప్రజలు వస్తుంటారు. అందులో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమాన్ని చూసేందుకు ఓ గ్రామంలోని గిరిజన కుటుంబం తొమ్మిదో తరగతి చదువుతున్న (14) ఏళ్ల బాలికతో సహా హాజరైంది అర్ధరాత్రి సమయంలో ఆ బాలిక తిరిగి ఒంట రిగా ఇంటికి వెళ్తున్నది.

ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బాలికను బలవంతంగా సమీపంలోని ఓ రేకుల షెడ్డులోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.నిందితుల్లో ఒకరు ఓ మండలం లోని కో ఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు బాధ్యత కుటుంబీకులు పేర్కొన్నారు.ఈ ఘటనపై ఉప్పనుంతల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి తెలిపారు.

నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసి.. నిందితులను కఠినంగా శిక్షించేలా చూస్తామన్నారు.