19 June, 2026 | 4:22 AM

గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

19-06-2026 12:26 AM

80 కిలోల గంజాయి, కారు స్వాధీనం 

అశ్వాపురం, జూన్ 18, (విజయక్రాంతి): అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం మణుగూరు పోలీసులు అరెస్టు చేసి 80 కిలోల గంజాయిని, కారును స్వాధీనం చేసుకున్నారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి మణుగూరు తోగ్గుడెం వద్ద పోలీస్ తనిఖీలు నిర్వహిస్తుండగా, భద్రాచలం నుండి ఒరిస్సాకు స్కార్పియో వాహనం తనిఖీ చేయగా 80 కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని  అరెస్ట్ చేశారు.

వారి నుంచి 80 కేజీల గంజాయితో పాటు స్కార్పియో ను స్వాధీనం చేసుకున్నారు. ఇరువురు రాజస్థాన్ కు చెందిన సురేంద్ర సింగ్, ధర్మేంద్ర కుమార్ గా విచారణలో వెల్లడైంది. వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు మణుగూరు  డిఎస్పి రవీందర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగబాబు, ఎస్త్స్ర నగేష్ కుమార్, ఎస్త్స్ర రవుఫ్ లు, హెడ్ కానిస్టేబుల్ దామోదర్, కానిస్టేబుల్ మురారి  పాల్గొన్నారు