ఆ గ్రామం పేరు నేపాల్ లో లిఖించిన యువకుడు
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): మారుమూల గ్రామం పేరు నేపాల్ లో లిఖించిన యువకుడు. ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన బోరంచ గణేష్ చంద్రకళ కుమారుడు మధు 2008లో ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం ఇంటర్నెట్ పూర్తి చేసి చిన్నప్పటి నుంచి రన్నింగ్ చేస్తూ ఏదో సాధించారని దృఢ సంకల్పంతో హైదరాబాదులోనే గచ్చిబౌలిలో ఢిల్లీలో నిర్వహించిన రన్నింగ్ పోటీల్లో పాల్గొని నేపాల్ రాష్ట్రంలో ఈనెల 28వ తేదీన నిర్వహించిన ఇంటర్నేషనల్ రన్నింగ్ పోటీలలో పాల్గొని విజయకేతనం ఎగురవేశారు. నేపాల్ రాష్ట్రంలో నేపాల్ యువకులు ఆరుగురు మరో ఇద్దరూ భారతీయులు ఇద్దరు 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని 11 సెకండ్లలోనే మొదటివాడుగా అన్నాసాగర్ గ్రామానికి చెందిన మధు తన పేరు ఆ గ్రామం పేరును నేపాల్ లో లిఖించాడు. ఆ యువకుడు రన్నింగ్ పోటీలో నేపాల్ లో ఘనత సాధించడంతో యువకులు గ్రామస్తులు తీవ్ర సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






