వీవోఏ భవనానికి రెండు సార్లు భూమిపూజ
మల్లాపూర్, మార్చి, 10(విజయక్రాంతి):మల్లాపూర్ మండల కేంద్రంలో వీవోఏ భవన నిర్మాణ పనులకు రెండు సార్లు భూమిపూజ నిర్వహించడం ప్రోటోకాల్ ఉల్లంఘనగా భావిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవారం స్థానిక తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు.వివరాల్లోకి వెళితే, ఈ నెల అరవ తేదీన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో అధికారులతో కలిసి వీవోఏ భవన ని ర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
అయితే ఈ పనులకు ఈ నెల తొమ్మిదవ తేదీన కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అధికారులతో కలిసి మళ్లీ భూమిపూజ నిర్వహించడం జరిగింది. దింతో ఒకే పనికి రెండు సార్లు భూమిపూజ చేయడం ప్రోటోకాల్కు విరుద్ధమని బీఆర్‌ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వారు వినతి పత్రం సమర్పించారు.ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు.




