11 March, 2026 | 4:57 AM

అటెండర్ ఆత్మహత్యా యత్నం

11-03-2026 12:00 AM

అధికారి వేధింపులే కారణం!

మంచిర్యాల, మార్చి 10 (విజయక్రాంతి): జిల్లా వ్యవసాయాధికారిణి వేధిస్తున్నదని ఆరోపిస్తూ అటెండర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంచిర్యాలలో మంగళవారం జరిగింది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సురేఖ తనను నిరంతరం పనిచేయాలని ఒత్తిడి చేస్తూ వేధిస్తున్నదంటూ అటెండర్ బొల్లి శ్రీనివాస్ కార్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

సహచరులు స్పందించి ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా జడ్జి సైతం ఆసుపత్రికి వెళ్లి బాధితుడి వాం గ్మూలాన్ని నమోదు చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.