23 May, 2026 | 4:27 AM

ఇద్దరు నిందితుల అరెస్ట్

23-05-2026 12:00 AM
  1. రూ.29 వేల నగదు, స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనం
  2. డీఎస్పీ వెంకటేశ్వర్లు

జడ్చర్ల, మే 22: లిఫ్ట్ అడిగి నమ్మించి దోపిడీకి పాల్పడిన ఇద్దరు నిందితులను జడ్చర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం చర్చల పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు.  నిందితుల నుంచి  దోచుకున్న మొత్తం రూ.29 వేల నగదు, ఒక స్కూటీ, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్ల ఇన్స్పెక్టర్ కమలాకర్ ఈ నెల 19న రాత్రి 8 గంటల సమయంలో వైఎస్‌ఆర్ కడప జిల్లా జంగాలపల్లి గ్రామానికి చెందిన ఒక ప్రైవేట్ ఉద్యోగి, ప్రస్తుతం జడ్చర్లలోని పోలేపల్లి సెజ్ వద్ద పని చేస్తూ క్లబ్ రోడ్లో నివాసముంటున్నాడు.

అతను జడ్చర్ల హైవే పక్కన ఉన్న జమ్ జమ్ హోటల్ వద్ద భోజనం చేసి తిరిగి తన గదికి వెళ్తుండగా జడ్చర్ల బస్టాండ్ సమీపంలో ఒక వ్యక్తి తమ పోలీస్ వాహనం చెడిపోయిందని చెప్పి లిఫ్ట్ అడిగాడు. అతని మాటలు నమ్మిన బాధితుడు తన స్కూటీపై నక్కలబండ తండా వైపు తీసుకెళ్లాడు. అక్కడ ఒక వెంచర్ ప్రాంతంలోకి తీసుకెళ్లిన అనంతరం మరో వ్యక్తి వచ్చి ఇద్దరూ కలిసి బాధితుడిని బెదిరించి, కత్తితో తలపై కొట్టి రక్తగాయాలు చేసి, అతని వద్ద ఉన్న రూ.2 వేల నగదును బలవంతంగా తీసుకున్నారు.

అనంతరం బాధితుడి సెల్ఫోన్ ద్వారా ఫోన్ పే ద్వారా రూ.36,690 లను తమ ఖాతాకు బదిలీ చేయించారు. చంపేస్తామని బెదిరించి అక్కడి నుండి పరారయ్యారు. గాయపడిన బాధితుడు మహబూబ్ నగర్లోని ఎస్విఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు సందర్భంగా శుక్రవారం ఉదయం  జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి క్రింద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా వారు పై నేరాన్ని ఒప్పుకున్నారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.