10-02-2026 01:42:55 AM
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ చేతికి చిప్ప ఇచ్చింది
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ‘కేం ద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని నమ్మించే బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. పన్నెండేళ్ల నుంచి బీజేపీ తెలంగాణకు పంగనామాలు పెడుతూనే ఉంది. మొత్తంగా తెలంగాణ చేతికి ఇచ్చింది చిప్ప మాత్రమే. కే్ంర దం నుంచి ఏ మంత్రి వచ్చినా లక్షల కోట్లు మం జూరు చేశామని చెబుతున్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్ను ల రూపంలో చెల్లించిన వాటానే రాష్ట్రానికి ఇస్తున్నారు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి ఇస్తే.. తిరిగి రాష్ట్రానికే 42 పైసలే వస్తున్నయి. కర్ణాటకకు 16 పైసలు, తమిళనాడుకు 26 పైసలు, కేరళకు 49 పైసలు మాత్రమే వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు బీ జేపీ తీరని అన్యాయం చేస్తోంది. మనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందని లెక్కలు చెబుతున్నాయి. ఇంత జరుగుతుంటే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి ఏం చేస్తున్నరు.
ఈ వివక్షపై ప్రధాని మోదీని కానీ, నీతి ఆయోగ్‌ను ఏరోజైనా వారు నిలదీశారా? ఇప్పుడేం ముఖం పెట్టుకుని ప్రజల్ని ఓట్లడుగుతున్నారు’ అంటూ సీఎం నిలదీశారు. ము న్సిపల్, నగరపాలక ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీనే అని తేల్చిచెప్పారు. పట్టణ ప్రాంత ప్రజలు కళ్లముందు ఉన్న గతం, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని బూ తంగా చూపి, బీజేపీ నేతలు ఇంకెంతకాలం మత రాజకీయాలు చేస్తారు?’ అని నిలదీశా రు.
బీజేపీ దేవుడు రాముదు కాదని, ఒవైసీ నేనని పేర్కొన్నారు. రాజకీయ మనుగడ కో సం మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ భావదారిద్య్రానికి నిదర్శనమని సీఎం దు య్యబట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2014 పాలమూరు సభలో పాల మూరు-- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తుమని బీజేపీ హామీ ఇచ్చింది. మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ అంశాన్ని ప్రస్తావించి జాతీయ హోదా ప్రకటిస్తారనుకున్నాం.
కానీ, అది జరగలేదు. మొన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆదిలాబాద్‌కు ప్రచారానికి వచ్చిన ప్పుడు ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు సహకరిస్తామని ప్రకటిస్తారని అనుకు న్నాం. కానీ, ఫడ్నవీస్ ఆ హామీ ఇవ్వలేదు. హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు ‘కారుకు కారు, బైకుకు బైకు’ ఇస్తామని బండి సంజయ్ ప్రచారం చేశారు.
ఆ హామీలకు కిషన్‌రెడ్డి కూడా ఆమోదం తెలిపారు. ఎవరైనా.. ఆ మాటలు నమ్మి జీహెచ్‌ఎంసీలో 1/3 ప్రజలు బీజేపీకి ఓటు వేశారు. కానీ, ఇప్పటి వరకు కారుకు కారు, బైక్‌కు బైక్ అందలేదు. సత్రం భోజనానికి నెల్లూరు పెద్దారెడ్డి రెకమెండేషన్ ఇచ్చినట్టుంది బండి సంజయ్ తీరు’ అని సీఎం ఎద్దేవా చేశారు.
జాతీయ హోదా దేనికి ఇచ్చింది?
తెలంగాణపై కేంద్రప్రభుత్వం తీవ్రమైన వివక్ష చూపిస్తున్నదని సీఎం మండిపడ్డారు. ‘కేంద్ర ప్రభుత్వ విచక్షణ అధికారంతో తెలంగాణకు ఏ ఒక్కటీ ఇవ్వలేదు. ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వలేదు. మూసీ పునరుజ్జీవానికి అదనంగా నిధులు ఇవ్వలేదు. మెట్రోవిస్తరణకు నిధు లు తీసుకురాలేదు. సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక నిధులు తేలేదు. తెలంగాణకు రావాల్సిన ఐటీఐఆర్‌ను, సెమీ కండక్టర్ ప్రాజెక్టులివ్వలేదు.
పన్నెండేళ్లలో రాష్ట్రానికి ఎప్పుడైనా కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇచ్చిందా? బీజేపీ ఎంపీలు కనీసం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలైనా నిధులు తెచ్చారా? ఖమ్మంలో వరదలు వచ్చిన సమయంలోనూ కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వలేదు. వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ నిధులు కూడా రాష్ట్రమే చెల్లించింది’ అని సీఎం గుర్తుచేశారు. ‘ఇప్పుడు ప్రధాని మోదీని చూసి ఓటు వేయాలని బీజేపీ నేతలంటున్నారు? గల్లీ ఎలక్షన్‌కు మోదీకి ఏం సంబంధం? మోదీ వచ్చి మోరీ తీస్తారా? ఓట్లు వేయించుకోవడం.. సీట్లు తెచ్చుకోవడం తప్ప బీజేపీ తెలంగాణకు ఇచ్చిందేమి లేదు’ అని సీఎం దుయ్యబట్టారు.
బీఆర్‌ఎస్ నేతలవి విద్వేష ప్రసంగాలు
బీఆర్‌ఎస్ నేతల ప్రసంగాలపై సీఎం నిప ్పులు చెరిగారు. ‘తెలంగాణలో పదేళ్లపాటు బీఆర్‌ఎస్ అధికారంలో ఉంది.. సర్పంచ్ నుంచి మున్సిపల్ స్థాయి వరకూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ దొరల్లా పెత్తనం చెలాయించారు. ఇవాళ సమస్యలకు ప్రధాన కారణం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ కాదా? ఏ ముఖం పెట్టుకుని ఇపుడు మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు ? మాదకద్రవ్యాలు తీసుకున్న వారిలో వారు విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు.
ఒకరకమైన ఉన్మాదంతో వారు ఫోన్ ట్యాపింగ్ చేశారు. కొందరిని బ్లాక్‌మెయిల్ చేసి వందలాది కోట్లు వసూలు చేశారు . విచారణకు పిలిస్తే ముసుగు తొడుక్కుని వెళ్లకుండా బరితెగించి యుద్ధానికి వెళ్లినట్టు వెళుతున్నారు. బీజే పీ, బీఆర్‌ఎస్‌ది 2023 వరకు విడదీయలేని అనుబంధం. కేంద్రం అన్యాయంగా తీసుకున్న నోట్ల రద్దు, రైతు వ్యతిరేక నల్లచట్టాలు, ట్రిపుల్ తలాక్ నిర్ణయాలకు బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తున్నారు.
నాడు ‘మీ ప్రేమ ఉంటే చాలు.. ఇంకేమీ అవసరం లేదు’ అని మోదీ తో కేసీఆర్ అన్నది నిజం కాదా. ఈ బంధాన్ని తెలంగాణకు నిధులు తేవడానికి మాత్రం ఉపయోగించలేదు. అందుకే ఇప్పుడు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టు కాకుండా బీజేపీ కాపాడుతోంది’ అని సీఎం అన్నారు. బీఆరెస్‌ను యాసిడ్ పోసి కడిగితే తప్ప రాష్ట్రానికి పట్టిన పీడ వదలదని, మళ్లీ బీఆర్‌ఎస్ మొక్కను మొలవనివ్వద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎన్నో సంక్షేమ పథకాలు అమలు..
తాము అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖునే జీతం వచ్చేలా చేశామని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. రేషన్ కార్డులు అందించి పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపా రు. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన రూ.9 వేల కోట్ల బకాయిలను ఆర్టీసీకి చెల్లించామని వెల్లడించారు.
తొమ్మి ది రోజుల్లో రూ.9 వేల కోట్ల మేర రైతు భరోసా చెల్లించామని గుర్తుచేశారు. సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తూనే, రైతులు పండించిన ప్రతీ గింజ కొంటున్నామని తెలిపారు. పేదల సొంతింటి కల నెరవేర్చేంప దకు ఒక నియోజకవర్గానికి 3,500 చొప్పు న ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీని అభివద్ధి చేస్తున్నామని తెలిపారు. వందేళ్లలో ఎప్పుడూ లేని విధం గా బీసీ కులగణన చేసి చూపించామని వెల్లడించారు.
౧౨ఏళ్ల మోదీ పాలన, పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుని ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ‘తెలంగాణ ప్రయోజనాల కోసం తాను ప్రధాని మోదీని కలిసి నిధులు అడుగుతాం. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతాం. మరో ఎనిమిదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసే బాధ్యత సీఎంగా, మున్సిపల్ మంత్రిగా నాది’ అని సీఎం పిలుపునిచ్చారు.