10-02-2026 01:43:37 AM
జైలుకు పోకుండా ఉండేందుకు సాక్ష్యాలు మాయం చేసిండు
ప్రమాదవశాత్తు జరిగింది కాదు.. రేవంతు డైరెక్షన్ లో జరిగిన ప్రమాదం..
మెదక్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్ రావు
మెదక్, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి) :ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డి జైలు కు పోవడం ఖాయమని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా మెదక్, నర్సాపూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక రేవంత్ రెడ్డి హస్తం ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపో యిన దొంగ అని, జైలుకు పోయే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి అందుకే సాక్ష్యాలు మాయం చేసేందుకు హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ ను దగ్దం చేసిందని ఆరోపించా రు.
పోలీసుల సహకారంతో ఈ కుట్ర పన్నిండనీ తెలిపారు. హైదరాబాద్ లో పేదల బ తుకులు కూల్చిండనీ జైలుకు పోకుండా ఉం డేందుకు సాక్ష్యాలను మాయం చేసిండనీ, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో పోలీసులు చేసిన ద హన ఖాండ అని పేర్కొన్నారు. ఓటుకు నో టు కేసులో రేవంతుకు శిక్ష పడక తప్పదని, జైలుకు పోక తప్పదని అన్నారు. రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ చేసింది గుండు సు న్నా అని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి మి ర్యాలగూడ, భూపాలపల్లి, నిజామాబాద్ పో యిండు కానీ మెదక్ కు వచ్చేందుకు ముఖం లేదన్నారు. ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మాట తప్పిండు కాబట్టి ఆయనకు భయం పట్టుకుందని, రుణమాఫీ మాట తప్పి మోసం చేసిండనీ తెలిపారు. రైతు బంధు ఎగ్గొట్టిండనీ, ఎరువులకు కరు వు తెచ్చిండు రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు. పొద్దుగల్ల లేస్తే రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడటం తప్ప ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించారు.
రంజాన్ పండుగకు తోఫా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత రంజాన్ పండుగ సందర్భంగా పంపిణీ చేసే రంజాన్ తోఫా ఇవ్వలేదని, షా దీ ముబారక్ చెక్కులు రావడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయంలోనే మహిళలకు పెద్దపీట వేశారని హరీష్ రావు అన్నారు. రూ.2 వేలు పెన్షన్ చేసిన ఘనత కేసీఆర్ డే అని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ తో పాటు క ళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల ను అందించారని గుర్తు చేశారు.
కానీ కాంగ్రెస్ పార్టీ తులం బంగారం దిక్కు లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో 25 గంటల కరెంటు ఇస్తా అన్నాడు కనీసం 12 గంటలు కూడా రావడం లేదని అన్నారు.ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు అని గుండు కొట్టిండు..ఉద్యోగస్థులకు డీఏ లేదు, పీఆర్సీ లేదనీ మండిపడ్డారు. అంతేకాదు రిటైర్డ్ ఉ ద్యోగులకు రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వడం లేదని, అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసం చేసింది సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు.
గుండాలతో రౌడీజం చేస్తున్న కాంగ్రెస్...
మెదక్ లో కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి గుండాలతో రౌడీ ఇజం చేస్తుందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ వాళ్లను గెలిపించుకోకుంటే బిల్లులు రావని బెదిరిస్తున్నరట మె దక్‌లో నీపిట్ట బెదిరింపులకు, చిల్లర బెదిరింపులకు భయపడమని హెచ్చరించారు. ఈ రోడ్ షో లో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి, మాజీ mlc లు సుభా ష్ రెడ్డి, పారూక్ హుసెన్, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, కంటా రెడ్డి తిరుపతి రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ లు బట్టి జగపతి, మల్లికార్జున్ గౌడ్, బీ ఆర్ ఎస్ నాయకులు అకిరెడ్డి కృష్ణా రెడ్డి, సురేందర్ గౌడ్, బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.