25 August, 2026 | 6:05 AM

గూడూరు ఎంపీడీవోగా టీవీఎల్‌ఎన్ శాస్త్రీ నియామకం

25-08-2026 12:05 AM

మహబూబాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా టీవీఎల్‌ఎన్ శాస్త్రి నూతనంగా నియమితులయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన టీవీఎల్‌ఎన్ శాస్త్రికి కార్యాలయ సిబ్బంది, పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందిస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు.