calender_icon.png 14 February, 2026 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీవీకే ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు

14-02-2026 12:00:49 AM

  1. పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పష్టీకరణ
  2. అధికార డీఎంకే పార్టీ ఉచిత పథకాలు, వరాలపై కౌంటర్
  3. సీఎంకు ఎన్నికలప్పుడే హామీలు గుర్తొస్తాయి అని ఎద్దేవా
  4. తాత్కాలిక ప్రయోజనాల కంటే శాశ్వాత అభివృద్ధి ముఖ్యం

చెన్నై, ఫిబ్రవరి 13: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఒం టరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ స్పష్టం చేశారు. తమ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ఆ యన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు ను కోరుకుంటున్నారని, తన ‘విజిల్’ గుర్తుకే ఓటర్లు మద్దతు ఇస్తారని  ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులోని సేలంలో శుక్రవా రం జరిగిన టీవీకే బహిరంగ సభలో  అ ధికార డీఎంకే ప్రభుత్వంపై విజయ్ ఘాటు వి మర్శలు చేశారు. తమ రాజకీయ సభలకు అనుమతులు నిరాకరిస్తూ ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు.

తాను రాజకీయాల్లోకి రావడమే తప్పు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భం లోనే డీఎంకే ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలు, వరాలపై విజయ్ కౌంటర్ ఇచ్చా రు. కేవలం ఎన్నికల సమయంలోనే ఇలాం టి హామీలు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం మానుకోవాలని సూచించారు. తాత్కాలిక ప్రయోజనాల కంటే శాశ్వత అభివృద్ధి ము ఖ్యం అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు.

గుండెపోటుతో వ్యక్తి మృతి

సభలో విజయ్ మాట్లాడుతుండగా మ హారాష్ట్రకు చెందిన సూరజ్ (37) అనే వ్యక్తి అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. ఎండ లో సుమారు రెండు గంటల పాటు వేచి ఉండటంతో తీవ్రమైన వేడికి ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండ గానే మార్గమధ్యలో ఆయన కన్నుమూశా రు. సూరజ్ గత 20 ఏళ్లుగా సేలంలోనే నివసిస్తున్నారు.

వెండి సంబంధిత కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడని, భార్యా, బిడ్డ తో కలిసి ఉంటున్నట్లు చెప్పారు. సూరజ్ గతంలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న ట్లు పోలీసులు గుర్తించారు. అనుమ తించిన సంఖ్య కంటే ఎక్కువ మందిని నిర్వాహకులు లోపలికి పంపడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.  విచారణ జరిపి నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.