పసుపును ఆహార పంటగా గుర్తించాలి
- క్వింటాల్ కు రూ.16వేల మద్దతు ధర ప్రకటించాలి
- టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి) : పసుపును ఆహార పంటగా గుర్తించి క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిజామా బాద్‌కు చేరువగా మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్‌లో క్వింటాల్ పసుపునకు రూ.17 వేల ధర పలుకు తుందని తెలిపారు. నిజామాబాద్ మార్కెట్‌లో వ్యా పారులు సిండికేట్‌గా మారి రూ.13 వేలకు మించి ధర పెట్టడం లేదని, దీంతో పసుపు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పుసైస్ బోర్డు ఉత్సవ విగ్రహంలా మారిందన్నారు.
స్పుసైస్ బోర్డును బలోపేతం చేసి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లా ల్లోని పసుపు రైతులకు అండగా నిలవాలని కోరారు. వెంటనే ఆహార పంటల జాబితాలో పసుపును చేర్చి కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరారు. నిజామాబాద్ మార్కెట్‌లో ఇంకా లక్ష క్వింటాళ్లకు పైగా పసు పు పంట కొనుగోలు చేయాల్సి ఉందని, ఆ రైతులకు ప్రయోజనం చేకూర్చాలని కోరారు. ఈప్రూ 2.0 ప్రారంభ సమయంలో నిజామాబాద్ మార్కెట్‌ను చేర్చకపోవడంతో పసుపు రైతులు తీవ్రంగా ఇబ్బం ది పడ్డారని, చేర్చిన తర్వాత కూడా ఆన్ లైన్‌లో వివరాలు ఇవ్వడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.






