విద్యుత్ కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
తిరుమలాయపాలెం, మే 1 (విజయక్రాంతి): తెలంగాణలో విద్యుత్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, సంవత్సరాల తరబడి సేవలందించి పదవి విరమణ పొందిన కార్మికులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని 1104 యూనియన్ జిల్లా అదనపు కార్యదర్శి పూజ సురేష్ కోరారు.
మండల పరిధిలోని పిండిప్రోలు సబ్స్టేషన్ వద్ద మేడే సందర్భంగా నూతన 1104 కార్మికుల శిలాఫలకాన్ని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొర్ల సీతారామయ్య ఆవిష్కరించగా, మేడే జెండాను పూజ సురేష్ ఆవిష్కరించారు.
అనంతరం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధనలో కూడా విద్యుత్ కార్మికులు చేసిన కృషిని గుర్తించాలని, వెంటనే ప్రభుత్వం స్పందించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ డివిజన్ ట్రెజరర్ కె. శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ జాకీర్ షరీఫ్, అదనపు కార్యదర్శి కనగాల కృష్ణమూర్తి, తిరుమలాయపాలెం సెక్షన్ సిబ్బంది ఉండేటి రవి, గడ్డి కొప్పుల రాములు, యడ్ల ప్రభాకర్, కొంగర నాగేశ్వరరావు, పరికపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.






