13 May, 2026 | 5:19 AM

భిక్కనూర్ మండల సర్పంచుల ఫోరమ్ చైర్మన్గా తుడుం పద్మ-స్వామి

13-05-2026 12:00 AM

భిక్కనూర్, మే 12 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో మండల సర్పంచుల ఫోరమ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఫోరమ్ చైర్మన్గా బస్వాపూర్ సర్పంచ్ తుడుం పద్మ-స్వామి, వైస్ చైర్మన్గా అయ్యవారిపల్లి సర్పంచ్ జల సత్యం ఎన్నికైనట్లు సమావేశం అనంతరం వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు సర్పంచులు అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు.