సోలార్ ప్యానెల్స్‌పై ట్రంప్ సుంకాలు
- భారత్‌పై 126 శాతం, ఇండినేషియాపై 143 శాతం,లావోస్‌పై 81 శాతం విధింపు
- అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరింత దూకుడు
వాషింగ్టన్, ఫిబ్రవరి 25: ఒకపక్క కోర్టు అక్షింతలు వేసినా, తీర్పులిచ్చినా, మరోపక్క అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తున్నా, ఇం కోపక్క ఇటీవలే ఇండియా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకున్నా భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడులో మాత్రం మా ర్పు రావడం లేదు. తాజాగా భారత్ నుంచి అమెరికా దిగుమతులు చేసుకునే సోలార్ ఉత్పత్తులపై ప్రాథమికంగా 126 శాతం సుం కాల్ని విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ఫ్యా రెట్ సబ్సిడీల ఆధారంగా ఈ రేటు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్ సోలార్ తయారీ రంగంలో అన్యాయమైన పద్ధతిలో సబ్సిడీలు ఇస్తోందని, దీనివల్ల అ మెరికా స్థానిక తయారీదారులు నష్టపోతున్నారని అమెరికా వాణిజ్యవిభాగం పేర్కొం ది. అంటే భారత్ నుంచి వెళ్లే సోలార్ ప్యానె ల్స్ ధరలు, అమెరికాలో కంటే తక్కువగా ఉన్నాయని అర్థం. అందుకే అమెరికా భారత్ సోలార్ ప్యానెల్స్‌పై భారీ టారిఫ్ విధించింది.
మన దేశంతోపాటు మరో రెండు దేశాలపై ట్రంప్ టారిఫ్ విధించారు. ఇండోనేషియా సోలార్ ఉత్పత్తులపై 143 శాతం, లావోస్‌పై 81 శాతానికి దిగుమతి సుంకాల్ని పెంచుతున్నట్లు తెలిపారు. ట్రంప్ ప్రకటనతో అమెరికాకు సోలార్ ఉత్పత్తులను ఎగు మతి చేసే మన కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో బుధవారం స్టాక్‌మార్కెట్లలో సోలార్ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి.




