26 February, 2026 | 2:49 AM

ఏప్రిల్ 1 నుంచి ఈ20 పెట్రోల్

26-02-2026 01:06 AM
  1. పెట్రోల్ బంకుల్లో విక్రయం తప్పనిసరి చేస్తూ- కేంద్రం ఆదేశం
  2. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: దేశంలో మిని మం ఆర్‌ఓఎన్95 కలిపిన ఈ20 పెట్రోల్ విక్రయాన్ని ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరి చే స్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2026 ఏప్రిల్ 1 నుంచి 20శా తం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ 20), కనీసం రిసెర్చ్ ఆక్టేన్ నంబర్ (ఆర్‌ఓఎన్) 95 కలిగిన ఇంధనాన్ని మాత్రమే విక్ర యించాలని కేంద్రం పెట్రోల్‌బంకులను ఆదేశించింది.

ఫిబ్రవరి 17న చమురు మంత్రిత్వశాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకా రం, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) నిర్దేశిత ప్రమాణాల ప్రకారం, 20 శా తం వరకు ఇథనాలు మిశ్రమం, కనీసం రాన్ 95 కలిగిన పెట్రోల్‌ను మాత్రమే చమురు సం స్థలు దేశవ్యాప్తంగా విక్రయించాలని కేంద్రం ఆదేశించింది.

అయితే ప్రత్యే క పరిస్థితుల్లో, కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు పరిమిత కాలంపాటు ఈ నిబంధన నుంచి మి నహాయింపు ఇచ్చే అధికారం కేంద్రానికి ఉంటుందని పేర్కొంది. 2023 నుంచి భారతదేశం లో తయారైన మెజారిటీ వాహనాలు ఈ20 ఇంధనంతో నడిచేలా రూపొందించారు. కనుక వాటికి ఎటువంటి ఇబ్బందు లు ఉం డవని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.