15 June, 2026 | 12:38 PM

యుద్ధం ముగిసింది.. ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. ట్రంప్ కీలక ప్రకటన

15-06-2026 11:30 AM
  1. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం
  2. హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలని ట్రంప్ ఆదేశాలు
  3. మధ్యప్రాచ్యంలో కొత్త శకానికి స్వాగతం
  4.  జూన్ 19న స్విట్జర్లాండ్‌లో సంతకాలు

వాషింగ్టన్: ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రకటన చేశారు. శాంతి ఒప్పందానికి సహకరించిన అందరికీ డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలిపారు. సుంకం లేకుండా హర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు.

ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ఎత్తివేయాలని ఆదేశించినట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ''ప్రపంచంలోని నౌకలు.. మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి.. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణా చేయండి'' అని ట్రంప్ తెలిపారు. 

మధ్యప్రాచ్య పరిణామాలు, ప్రపంచ రాజకీయాలపై తాజా వార్తల కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజ్‌ను సందర్శించండి.

అమెరికా శాంతి ఒప్పందాన్ని ఇరాన్ ధృవీకరించింది. ఒప్పందం కుదిరినట్లు ఇరాన్ డిప్యూటీ విదేశాంగమంత్రి గరీబాబాదీ వెల్లడించారు. దిగ్బంధనం ఎత్తివేత, ఇరాన్ ఆస్తుల విడుదలకు అమెరికా హామీ ఇచ్చిందని ఇరాన్ తెలిపింది. తుది ఒప్పందం కోసం ప్రతిపాదిత 60 రోజుల చర్చల వ్యవధి ఉందని సూచించింది.

ఒప్పందంపై ఇరు దేశాలు జూన్ 19న స్విట్జర్లాండ్‌లో  సంతకాలు చేస్తాయని ఇరాన్ వెల్లడించింది. సంతకాల తర్వాత అవగాహన ఒప్పందం వివరాలు వెల్లడిస్తామని ఇరాన్ ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో కొత్త శకానికి స్వాగతం అంటూ ఇరాన్ ఎంబసీ ట్వీట్ చేసింది.