22 July, 2026 | 3:40 AM

ప్రజల కోసమే టీఆర్‌టీ కమ్యూనిటీ హాల్

22-07-2026 12:00 AM
  1. ధృవీకరించిన జోనల్ కమిషనర్ 
  2. ధన్యవాదాలు తెలిపిన గాంధీనగర్ మాజీ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): మాజీ కార్పొరేటర్ తో కలిసి అన్ని పార్టీల నిరసనల అనంతరం కేంద్ర మంత్రి, రాజ్యసభ ఎంపీల చొరవతో ఎట్టకేలకు టిఆర్ టి కమ్యూనిటీ హాల్ సమస్యకు తెర పడింది. జీహెచ్‌ఎంసి జోనల్ కమిషనర్  మంగతాయారు స్వయంగా కమ్యూనిటీ హాల్ కు విచ్చేసి గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్, బీజేపీ,  బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు టి ఆర్టి కాలనీ వాసులతో మాట్లాడుతూ  కమిషనర్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ హాల్ కేవలం ప్రజల ఉపయోగానికి శుభకార్యాలకు మాత్రమే  ఉపయోగిస్తామని తెలిపా రు. స్థానిక కాలనీ వాసులు మాజీ కార్పొరేటర్  జోనల్ కమిషనర్,  డిప్యూటీ కమిషనర్ లను సన్మానించి,  అధికారులకు స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ  కార్యక్ర మంలో బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ.వినయ్ కుమార్,  జీహెచ్‌ఎంసి  డిప్యూటీ కమిషనర్ పుష్పాలత, ఎఈ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేష్, బీజేపీ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, ఆనంద్ రావు, జ్ఞానేశ్వర్, సాయి గౌడ్, శ్యామ్, కాంగ్రెస్ నాయకులు మధుమతి, బాబ్జీ, అభిషేక్ కెనడి, బి ఆర్ ఎస్ నాయకులు రాకేష్, శ్రీకాంత్, మరియు స్థానికులు  చిట్టి, ఉమేష్, పవన్, మురళీ యేళ్ళప్ప, సాంసన్, మని పాల్గొన్నారు.