27 August, 2026 | 7:32 PM

బ్లాస్టింగ్ బాధిత రైతుకు పరామర్శ

27-08-2026 06:12 PM

గట్టు ఆగస్టు 27: గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్‌మాల ప్రాజెక్టు క్రషర్‌, బ్లాస్టింగ్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతు యేసును టీఆర్‌ఎస్‌ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్‌కుమార్‌ గురువారం పరామర్శించారు. పురుగుల మందు సేవించి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 


ఈ సందర్భంగా రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ బ్లాస్టింగ్‌ వల్ల దుమ్ము, ప్రకంపనలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంటలు, బోర్లకు నష్టం జరుగుతోందన్నారు. క్రషర్‌, అక్రమ బ్లాస్టింగ్‌పై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.