టెన్త్ ఫలితాల్లో త్రివేణి విజయ దుందుభి
విద్యార్థులకు ఎమ్మెల్యే వివేకానంద్ అభినందనలు
హైదరాబాద్, మే 2(విజయక్రాంతి): ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో అగ్రస్థానం సాధించిన త్రివేణి స్కూల్ చిం తల్ విద్యార్థులు శనివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేపీ వివేకానంద్ చరణ్ తామిరి 581 నిత్యశ్రీ మాదంశెట్టి 581, రూప శ్రీ లక్ష్మి నాగ సాయి బుసం 580, శ్రావణి పి 578, వినీత్ రెడ్డి ఎద్దండి 577,గీతిక బిట్ల 576,తేజేశ్వర్ కంటే576,చైతన్య కిశోర్ బల్లి 575, గణేష్ సాయి సాత్విక్ యలక 572,లకు స్వీట్లు తినిపించి పుష్పగుచ్ఛం అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ విజయం విద్యార్థుల పట్టుదలకు, త్రివేణి యాజమాన్యం అంకితభావానికి దక్కిన అసలైన ప్రతిఫలమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో త్రివేణి విద్యాసంస్థల ప్రతినిధులు సీఎస్‌వో సుబ్బారావు, సీఆర్‌వో వెంకట్రావు, చింతల్ బ్రాంచ్ ప్రిన్సిపాల్ శివ కీర్తన, అకాడమిక్ ఇన్‌చార్జి చిన్నారావు, ఇంపాక్ట్ ఇన్‌ఛార్జి వనిత, క్యాంపస్ ఇన్‌చార్జి క్రాంతి, అధ్యాపక బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.






