పాలేరు ప్రజలకే నా జీవితం అంకితం: కందాళ
కూసుమంచి, విజయక్రాంతి: ఎన్నికల్లో 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, 1000 రోజులైనా ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని పాలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం పాలేరు రిజర్వాయర్ ప్రాంగణంలో BRS పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మహా ధర్నా'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు కేవలం ఓట్ల కోసం వేసిన నాటకాలని తేలిపోయింది. క్షేత్రస్థాయిలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన ప్రతీ హామీని వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో పాలేరు గడ్డపై నుంచి ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






