కొనసాగుతున్న నిరసన గళం
02-09-2026 | 05:33pm
వరంగల్ (విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యావ్యవస్థ(Polytechnic education system)ను శక్తిలో విలీనం చేయాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హనుమకొండలో జేఏసీ(JAC) వరంగల్ యూనిట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన 17వ రోజుకు చేరింది. భోజన విరామ సమయంలో సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య(Polytechnic education)ను పరిరక్షించాలని, శక్తిలో విలీనం నిలిపివేయాలని, పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను కాపాడాలంటూ నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును, సిబ్బంది ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, ఈ అంశంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.