13 June, 2026 | 4:13 AM

గట్టు భీముడు 7వ వర్ధంతి సందర్భంగా నివాళులు

13-06-2026 12:33 AM

గట్టు, జూన్ 12 (విజయక్రాంతి): గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం బల్గెర గ్రామంలో  బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు 7వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం  ఆయనకు  నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో బాసు శ్యామల హనుమంతు నాయుడు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి గట్టు భీముడు విగ్రహానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయ కొట్టి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గట్టు భీముడు ప్రజలకు చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అని కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.