కార్గిల్ వీరులకు నివాళి
527 మొక్కలు నాటిన రోటరీ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్సిటీ
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ మహీంద్రా యూనివర్సిటీ, రోటరీ క్లబ్ ఆఫ్ లేక్ డిస్ట్రిక్ట్ మొయినాబాద్ ఆధ్వర్యంలో దూలపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫా రెస్ట్ అకాడమీలో ‘ప్రాజెక్ట్ ధన్యవాద్’ కింద 527 మొక్కలు నాటి కార్గిల్ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఆర్‌ఏసీఎం యూ అధ్యక్షుడు ఆర్టిఆర్. కౌశల్ తల్లూరి రూపకల్పన చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ శ్రీమతి ప్రియాంక వర్గీస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రోటరీ జిల్లా 3150 గవర్నర్ ఉదయ్ పిలాని సహకారం అందించగా, ఆర్‌సీఎల్డీ అధ్యక్షుడు రొటేరియన్ రమేష్ పటేల్, కార్యదర్శి రొటేరియన్ శాంతి పాల్రెడ్డి యువత దేశసేవ, పర్యావరణ పరిరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సైనిక అధికారులను సత్కరించడంతో పాటు 150 మందికి పైగా అటవీ అధికారులు, ఫారెస్ట్ రేంజర్లు, రోటరీ సభ్యులు, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొని మొక్కలు నాటారు.






