సీలింగ్ భూములను స్వాధీనం చేసుకున్న ఆదివాసీలు
07-07-2026 01:06 AM
చండ్రుగొండ, జులై6,( విజయక్రాంతి ): చండ్రుగొండ మండలం, దామరచర్ల గ్రామంలోని వివాస్పధ సీలింగ్ భూములను ఆదివాసీలు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సర్వే నెం: 48లో గల 7-34 (ఏడు ఎకరాల ముప్పు నాలుగు కుంటలు) భూమి తొలి విడతగా స్వాధీనం చేసుకున్నట్లు ఆదివాసీలు తెలిపారు.
దామరచర్ల రెవెన్యూ పరిధిలో మొత్తం 130ఎకరాల సీలింగ్ భూములకు నిజమైనా హక్కు దారులు, నలభై మంది ఆదివాసీలు దశల వారీగా ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారుల ఆర్డర్ల మేరకు, మాకు ఉన్న హక్కుల మేరకు స్వాధీనం చేసుకుంటామని ఆదివాసీ రైతులు రాజిని వెంకటేశ్వరరావు, సిద్దిని సీతరాములు, కాసిని రంగయ్య, పిట్టల పాపయ్య, పద్దం ముత్యాలు, పిట్టల ముత్తమ్మ, మలిపెద్ది బిందు, పిట్టల రాఘవులు, సాంబయ్య, కొర్రయ్య తదితరులు అన్నారు.






