7 July, 2026 | 3:05 AM

మీడియా అడ్వయిజరీ కమిటీ కార్యాలయం

07-07-2026 02:10 AM

అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించిన చైర్మన్, స్పీకర్, మంత్రులు

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రాష్ట్ర అసెంబ్లీలో ఆవరణలో అసెంబ్లీ మీడియా అడ్వజయిరీ కమిటీ కార్యాలయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందరెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాదక్‌కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలు కలిసి సోమవారం ప్రారంభించారు. అంతకు ముందు కార్యాలయంలో పూజ కార్యక్రమం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలతో అసెంబ్లీ, మండలి కార్యదర్శులు మీడియా అడ్వైజరీ కమిటి కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు పనులు దగ్గరుండి పర్యవేక్షించారు.

అసెంబ్లీ అడ్వైజరీ కమిటి కోసం ప్రత్యేకంగా దేశంలో ఏ అసెంబ్లీ లో ప్రత్యేక కార్యాలయం లేదు. పార్లమెంట్‌లో కూడా ఇలాంటి వసతి ఏర్పాటు జరగలేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా అసెంబ్లీలో మీడియా అడ్వైజరీ కమిటికి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. మొదటిసారి తెలంగాణ అసెంబ్లీలో మీడియా అడ్వైజరీ కమిటి కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయడంతో నూతన శకం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కమిటి చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కో చైర్మన్ పరిపూర్ణ చారి, మీడియా అకాడామీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కమిటీ సభ్యులు రంగారావు, సుంచు అశోక్, పూర్ణచందర్‌రావు, సురేఖ అబ్బూరి, బి. బసవపున్నయ్య, అంజనేయగౌడ్, ఎం. పవన్‌కుమార్, నాగేశ్వరరావులు పాల్గొన్నారు.