ఐటీ పార్క్ వద్ద డంప్ యార్డా?
- కాలుష్యం, రోగాలను ఇవ్వడమే ప్రజాపాలనా?
- సిద్ధాపూర్ జీవోను ఉపసంహరించుకోవాలి
- బాధిత రైతుల పక్షాన బీఆర్‌ఎస్ ఉద్యమిస్తుంది
- మాజీమంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో ఐటీ పార్క్ నిర్మించాల్సిన చోట డం ప్ యార్డు ఏర్పాటు చేస్తారా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన చోట కాలుష్యాన్ని, రోగాలను ఇవ్వడమే ప్రజాపాలనా? అని నిలదీశారు. ఇక పక్క చెరువు ఉందని, మరోపక్క దర్గా ఉందన్నారు. దీం తో ఇటు రైతులు, ప్రజలు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడతారని, మరోపక్క వ్యవసా యం సర్వనాశనం అవుతుందని అన్నారు. సిద్ధాపూర్ డంప్ యార్డు జీవోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకుం టే బాధిత రైతుల పక్షాన బీఆర్‌ఎస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
డంప్ యార్డ్ ఏర్పా టు నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న స్థానిక రైతులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావును సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. డంప్ యార్డు వల్ల తాము ఏ విధంగా నష్టపోతున్నామో వివరిస్తూ ఆయన ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మాజీమంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రా మంలో 86 ఎకరాల్లో డంప్ యార్డు ఏర్పా టు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నం.641 తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. పచ్చని వ్యవసాయ భూ ముల మధ్య, జనావాసాలకు సమీపంలో డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకోవడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిదర్శనమని విమర్శించారు. ఈ నిర్ణ యాన్ని బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
సిద్ధాపూర్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గ్రామాలు ఈ డంప్ యార్డు వల్ల తీవ్రంగా నష్టపోతాయని, వ్యవసాయం సమాధి అవుతుందన్నారు. డంప్ యార్డు ఏర్పాటు చేయాలనుకుంటున్న స్థలానికి ఆనుకుని ఉన్న ‘గుట్ట చెరువు’ నీటితోనే ఈ ప్రాంత రైతులు వ్యవసాయం చేస్తూ కూ రగాయలు పండిస్తున్నారని పేర్కొన్నారు. ఇ ప్పుడు ఆ చెరువు పక్కనే డంప్ యార్డు పెడి తే ఆ నీరు పూర్తిగా కలుషితమై, సాగు నీటి తో పాటు తాగునీటికీ తీవ్ర ముప్పు వాటిల్లుతుందన్నారు.
అంతేకాకుండా ఎంతో ప్రసిద్ధి చెందిన జహంగీర్ పీర్ దర్గా కూడా ఇక్కడే ఉండటంతో, ఆ కాలుష్యం స్థానికులతో పాటు భక్తులకు కూడా శాపంగా మారడం ఖాయమని వెల్లడించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే ప్రాంతంలో, డం ప్ యార్డుకు కేటాయించిన సర్వే నంబర్లు 252, 278, 361లో ఉన్న 334 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మించాలని ‘మేము ప్రణాళికలు రూపొందించాం. ఇక్కడ ఐటీ పార్క్ వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది’ అని బీఆర్‌ఎస్ సంకల్పించిందని గుర్తు చేశారు. కానీ, ఉపాధి కల్పించాల్సి న భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం డంప్ యార్డు ఏర్పాటు చేసి, స్థానిక ప్రజల బతుకులను చిదిమేయాలని చూడటం శోచనీ యమన్నారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన చోట కాలుష్యాన్ని, రోగాలను ఇవ్వడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిద్ధాపూర్ డంప్ యార్డు నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవా లని, లేనిపక్షంలో నష్టపోతున్న ఆ 20 గ్రామాల ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని, స్థానిక రైతులకు అండగా నిలబడి పోరాడుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు.






