భద్రాద్రి రామాయణం దర్శించుకున్న గిరిజన సంక్షేమ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర రెడ్డి
26-06-2026 01:05 AM
భద్రాచలం,జూన్ 25, (విజయక్రాంతి): గిరిజన సంక్షేమ శాఖ హైదరాబాద్ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం నాడు స్వామివారి దర్శనానికి వచ్చిన అడిషనల్ డైరెక్టర్ కుటుంబసభ్యులకు దేవస్థానం పర్యవేక్షకుడు సాయిబాబా , అర్చక స్వాములు ఘనంగా స్వాగతం పలికారు. బలపీఠం వద్ద ప్రత్యేక పూజలు జరిపి గర్భగుడిలో పూజలు నిర్వహించిన అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారిని ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అర్చక స్వాములు స్వామివారి పట్టు వస్త్రాలను అందించి స్వామివారి విశిష్టతను తెలిపి తీర్థ ప్రసాదాలు అందించారు.






