గోపాలపేట నడిరోడ్డుపై ప్రయాణికుల ఇబ్బందులు
నీడ, తాగునీటి కోసం ఎదురుచూపులు
నాగిరెడ్డిపేట, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): మండలం గోపాలపేట నడిరోడ్డుపై ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బస్సుల కోసం వేచి ఉండేవారికి సరైన నీడ సౌకర్యం లేకపోవడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు నడిరోడ్డుపై ఎండలోనే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సులు ఆలస్యంగా రావడం వల్ల ప్రయాణికులు ఎక్కువసేపు ఎండలోనే వేచి ఉండాల్సి వస్తోంది.
తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి, గోపాలపేట బస్టాండ్ వద్ద తక్షణం షెడ్ ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సదుపాయం కల్పించాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. బస్టాండు ఉన్నప్పటికీ బస్టాండ్ ప్రాంగణంలోనికి బస్సులు రాకపోవడంతో నడిరోడ్డుపై నిడబడాల్సివస్తుందని ప్రయాణికులు తెలుపుతున్నారు.




