2 April, 2026 | 7:12 PM

అప్రమత్తంగా ప్రయాణించండి

06-10-2025 12:00 AM

బాలానగర్ దగ్గర హైవేలో ట్రాఫిక్ నియంత్రణ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ జానకి

బాలానగర్, అక్టోబర్ 5: దసరా పండుగ సెలవులు ముగియడంతో జిల్లా నుండి హైదరాబా ద్ దిశగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిందని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా తమ ప్రయాణాలను కొనసాగించాలని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని బాలానగర్ టౌన్లో, హైవే 44 పై జరుగుతున్న ఫ్లైఓవర్ పనుల కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జిల్లా ఎస్పీ డి. జానకిట్రాఫిక్ పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సంబంధిత అధికారులకు రద్దీ సమయాల్లో వాహనాల కదలిక సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ట్రాఫిక్ డైవర్షన్లు, పహారా ఏర్పాట్లు సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బాలానగర్ ఎస్‌ఐ లెనిన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.