13 April, 2026 | 11:29 PM

ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతకే పెద్దపీట: ఎంపీడీఓ సరోజ

13-04-2026 09:47 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఉపాధి హామీ పథకంలో భాగంగా క్షేత్రస్థాయిలో సాంకేతికతను జోడించి, పనుల నిర్వహణలో మరింత పారదర్శకత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వర్కింగ్ మేట్స్, ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.​​ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్ అథెంటికేషన్ యాప్ ద్వారా ఇకపై ప్రతిరోజూ కూలీల హాజరును ఫోటోల ద్వారా సేకరించాల్సి ఉంటుందన్నారు.​ నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌లో హాజరును ఎలా నమోదు చేయాలి.

సాంకేతిక సమస్యలు తలెత్తితే ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశాలపై ఏపీఓ, టెక్నికల్ టీమ్ అవగాహన కల్పించారు.పారదర్శకత కోసం ప్రతి గ్రామ పంచాయతీ నుండి కొత్తగా వర్కింగ్ మేట్స్‌ను ఎంపిక చేసి,వారికి ఈ శిక్షణ అందించారు.ఉపాధి హామీ కూలీలు ప్రతి ఒక్కరూ పని ప్రదేశంలో ఉండాలని,కొత్త యాప్ ద్వారా ఫోటోలు తీయడం వల్ల అవినీతికి తావుండదని స్పష్టం చేశారు.ఫీల్డ్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో మేట్స్‌కు సహకరిస్తూ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.​ఈ కార్యక్రమంలో ఏపీఓ రాయికింది సురేష్,టెక్నికల్ అసిస్టెంట్లు సురేష్,హారిక,శిరీష,కంప్యూటర్ ఆపరేటర్ పవన్,మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు మరియు వర్కింగ్ మేట్స్ పాల్గొన్నారు.