29 June, 2026 | 11:06 PM

మర్డర్ కేసులో నిందితుల అరెస్ట్

29-06-2026 10:14 PM

బెల్లంపల్లి,(విజయ క్రాంతి): బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలో జరిగిన హత్య కేసులో  నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టు వివరాలను బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్ హనోక్ వెల్లడించారు. చందనవేన చంద్ అతని చిన్న తమ్ముడు సందనవేని రాజేశ్ కు గత కొంతకాలంగా వారి పొత్తుల దేవుని ఇంటి వద్ద గల పెరడు భూమి విషయములో గొడవలు జరుగుతున్నాయి. గతంలో సందనవేని చందు తన తమ్ముడు రాజేశ్ ను ఎలాగైనా చంపుతా అని బెదిరించాడు.

ఈ నెల 28 న సందనవెన రాజేష్ వారి పొత్తుల ఇంటి వద్ద ఉన్న ఒక సిమెంట్ రేకును  పట్టుకుపోయాడు. రేకును ఎందుకు పట్టుకుపోయావని అతని అన్న సందనవెన చందు, వదిన పద్మ, అన్న కొడుకు నవనీక్షిత్ ముగ్గురు కలిసి మద్యాహ్నం  1.30 గంటల సమయంలో సందనవేని రాజేశ్ తో గొడవ పడ్డారు. ఇదే అదునుగా భావించి సందనవేని చందు తన వెంట తీసుకొచ్చిన  గొడ్డలితో రాజేశ్ మెడ వెనుక భాగంలో గట్టిగా నరికాడు. రాజేశ్ కింద పడిపోయాడు.

అంతటితో ఆగకుండా చందు మళ్ళీ 4, 5 సార్లు రాజేశ్ మెడ, వీపు భుజం లపై గొడ్డలితో దాడిచేశాడు. దీంతో రాజేశ్ అక్కడిక్కడే చనిపోయాడు. ఈ హత్యకు చందుకు అతని కొడుకు నవనీక్షీత్, భార్య పద్మ లు సహకరించారు. ఆ తర్వాత  చందు అతని కొడుకు బబ్లూ @ నవనిక్షిత్ భార్య పద్మ లు అక్కడి నుండిపారిపోయారు. పక్కా సమాచారంతో నిoదితులను పట్టుకొని హత్య కు ఉపయోగించిన గొడ్డలి ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను  రిమాండ్ చేసినట్టు సీఐ హనోక్ వెల్లడించారు.