తల్లిని చంపి కొడుకు ఆత్మహత్య
29-06-2026 10:12 PM
భూదాన్ పోచంపల్లి: కన్న తల్లిని చంపి కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పెద్ద రావులపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సంఘం శ్రీనివాస్(44) మద్యానికి బానిసై రోజు తాగి వస్తుండడంతో తరచుగా గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో భార్యతో గొడవపడి ఆదివారం చితకబాదాడు. భార్యకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. సోమవారం తల్లి సంఘం పోశమ్మ(65)తో గొడవపడి రోకలి బండతో మోది చంపిన వెంటనే ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్ కి ఇద్దరూ కుమారులు ,ఒక కూతురు భూ వివాదాల కారణమని తెలిపిన గ్రామస్తులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది






