రోడ్లు డ్రైనేజీ పనులపై కమిషనర్ కు వినతి
జవహర్ నగర్,(విజయక్రాంతి): కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ లో పలు కాలనీల్లో ఉన్న రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ ముప్పా రామారావు, మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, అణుశక్తి కాలనీ నివాసుల సంఘం సభ్యులతో కలిసి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ కి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రతినిధి బృందం ఆయా కాలనీల్లో చాలా కాలంగా నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, ప్రజల ఇబ్బందులను వివరించారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపై స్పందించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ సమస్యలను పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






