13 April, 2026 | 11:28 PM

రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన ఎస్సై ఉదయ్ కుమార్

13-04-2026 09:50 PM

ధర్మపురి,(విజయక్రాంతి): రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని వెల్గటూర్ మండల ఎస్సై పులిచెర్ల ఉదయ్ కుమార్ సోమవారం నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాల మేరకు 99రోజుల ప్రజాపాలనలో భాగంగా అంబారిపేట గ్రామంలో కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై  ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పిస్తూ తగిన సూచనలు తెలియజేశారు. రోడ్డుపైన ప్రయాణించే ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచిస్తూ, మద్యం సేవించి వాహనం నడుపరాదని,

సీట్ బెల్ట్ తప్పకుండ ధరించాలని సూచించారు. అతివేగం నివారించడం,మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలని, ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామనీ తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పట్ల అవగాహన ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. గ్రామస్తులు, అధికారులు అందరూ కలిసి రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటిస్తామని ఈ సందర్బంగా ప్రతిజ్ఞ చేశారు.