calender_icon.png 18 February, 2026 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ వన్ ట్రైనీ అధికారుల బృందం శిక్షణ సందర్శన

18-02-2026 12:37:59 AM

  1. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి
  2. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్ ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి) : ఎంసిహెచ్‌ఆర్డి లో శిక్షణ పొందుతున్న60 మంది గ్రూప్1 ట్రైనీ అధికారులు బృందం మంగళ, బుధవారాలలో క్షేత్ర స్థాయి పర్యటనాలో భాగంగా శిక్షణ నిమి త్తం మంగళ వారం మహబూబ్ నగర్ కు చేరుకున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో భా గంగా గ్రామాల ను సందర్శించి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను,గ్రామాల ప్రగతిని తెలుసుకోనున్నారు.

గ్రూప్-1 అధికారుల శిక్ష ణా బృందం కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయిని కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ట్రైనీ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, భౌగోళిక, జనాభా వివరాలను వారికి వివరించారు. వలస కూలీలకు ప్రసిద్ధి చెందిన మహబూబ్ నగర్ జిల్లా గత కొన్నేళ్లలో సాగునీరు, వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమల రంగాల్లో మంచి అభివృద్ధి సాధించిందనని అన్నారు.

ట్రైనీ అధికారులు  గ్రామాల సందర్శన శిక్షణ కార్యక్రమంలో భాగంగా గండీడ్, నవాబ్ పేట్, చిన్న చింత కుంట, అడ్డాకల్,కౌకుంట్ల మండలాల్లోని కొన్ని గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి జీవన స్థితిగతులను, వారికి అందుతున్న ప్రభుత్వ సేవల గురించి తెలుసుకుంటారు.

అధికారులు తెలిపారు. 60 మంది ట్రైనీ అధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, జడ్పీ సీఈఓ వెంకట్ రెడ్డి, డీఆర్డీఏ నరసింహులు, జిల్లా సంక్షేమ అధికారి జరీనా తదితర అధికారులు పాల్గొన్నారు.