1 July, 2026 | 1:23 AM

కంటోన్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ డి.రాజేశ్వరరావు పదవీ విరమణ

01-07-2026 12:24 AM

రాజేశ్వరరావు దంపతులను ఘనంగా సన్మానించిన 

బోర్డ్ సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, బోర్డ్ సిబ్బంది

సికింద్రాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అసిస్టెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న డి. రాజేశ్వరరావు మూడు దశాబ్దాల సుదీర్ఘ సర్వీస్ తర్వాత మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

డి.రాజేశ్వరరావు1993లో పిడబ్ల్యుడి మజ్దూర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి 33 సంవత్సరాల పాటు ప్రజాసేవ చేసి అసిస్టెంట్ ఇంజనీర్ స్థాయికి చేరుకున్నారు.ఆయన హయాంలో కంటోన్మెంట్ పరిధిలో వంటి మౌలిక వసతుల అభివృద్ధికి విశేష కృషిచేశారు.ముఖ్యంగా బొల్లారం, తిరుమలగిరి ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు స్థానికుల మన్ననలు పొందడం అభినందనీయం.ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు సీఈవో మాట్లాడుతూ డి.రాజేశ్వరరావు నిబద్ధత, అంకితభావం మాకందరికీ ఆదర్శం.

ఆయన సేవలు కంటోన్మెంట్ బోర్డు ఎప్పటికీ మర్చిపోదు అన్ని  బోర్డ్ సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది స్పష్టం చేశారు. అనంతరం ఇంజనీర్ రాజేశ్వరరావు మాట్లాడుతూ 33 ఏళ్ల నా ప్రయాణంలో అధికారులు, సిబ్బంది, ప్రజల సహకారం మరువలేనిది. రిటైర్మెంట్ తర్వాత కూడా సమాజ సేవలో ఉంటాను అన్ని రాజేశ్వరరావు అన్నారు.ఈ వీడ్కోలు సభలో బోర్డు ఉన్నతఅధికారులు,ఉద్యోగులు, పాల్గొని రాజేశ్వరరావు దంపతులను ఘనంగా సన్మానించారు..