18 August, 2026 | 3:34 AM

విద్యార్థులకు భూసార పరీక్షలపై శిక్షణ

18-08-2026 01:36 AM

మొయినాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): చిలుకూరు క్లస్టర్ పరిధిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు భూసార పరీక్షలు, నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజేంద్రనగర్ భూసార పరీక్ష ప్రయోగశాలకు చెందిన వ్యవసాయ అధికారులు ఎం. సునీత, టి. వసంత విద్యార్థులకు భూసార నమూనాల సేకరణ, పరీక్ష విధానం, ఫలితాల ప్రాముఖ్యత, భూసార కార్డుల ఆధారంగా ఎరువుల వినియోగంపై ప్రాయోగిక శిక్షణ ఇచ్చారు.

మండల వ్యవసాయ అధికారి పి. అనురాధ, వ్యవసాయ అధికారి డబ్ల్యూ. దీనా, పాఠశాల ప్రిన్సిపాల్ శౌర్యరాజ్, సైన్స్ ఉపాధ్యాయులు పి. సునీత, జి. సునీల్ పాల్గొన్నారు. ‘భూసార పరీక్షఆరోగ్యకరమైన నేలసమతుల్య ఎరువుల వినియోగంఅధిక దిగుబడులు’ అనే సందేశాన్ని విద్యార్థులకు అందించారు.