6 May, 2026 | 12:57 PM

రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరి పాటించాలి: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

06-05-2026 12:13 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు(Traffic rules) తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే డా. కుచుకుళ్ల రాజేష్ రెడ్డి(MLA Rajesh Reddy) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని శ్రీపూర్ రోడ్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నల్ వ్యవస్థను జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వాహనాల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్రాఫిక్ రూల్స్‌ను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని సూచించారు. ప్రజల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే యువత ప్రత్యేకంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ఇతరుల ప్రాణాలను కూడా గౌరవించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు సూచనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలను కోరారు. వారితోపాటు డిఎస్పి శ్రీనివాసులు, ట్రాఫిక్ ఎస్ఐ కళ్యాణ్, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సురేంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు.