24 March, 2026 | 12:46 AM

మల్కాజిగిరిలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్

23-03-2026 12:00 AM
  1. 214 మందిపై కేసు

మద్యం మత్తులో యాక్సిడెంట్ చేస్తే 10 ఏళ్ల జైలు

మేడ్చల్, మార్చి 22 (విజయ క్రాంతి): వీ కెండ్ ఎంజాయ్మెంట్లో భాగంగా మత్తులో జోగుతూ రోడ్లపైకి వచ్చిన మందుబాబులకు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు షాకి చ్చారు. శని, ఆదివారాల్లో నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా వాహనదారులు పట్టుబడ్డారు. నిబంధనలు అతిక్రమించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 214 మందిపై కేసులు నమో దు చేశారు.

పోలీసులు పట్టుకున్న కేసుల్లో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే ఉన్నా రు. టూ వీలర్లు187,కార్లు/ఫోర్ వీలర్లు 21,ఆ టోలు 5,భారీ వాహనాలకు చెందిన ఒకరు ఉన్నారు. పట్టుబడిన వారిలో ఆల్కహాల్ శాతం (BAC) పరిశీలిస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. 189 మందిలో 36 ఎంజి నుంచి 200 ఎం జి వరకు ఉండ గా, 10 మందిలో అత్యధికంగా 301 ఎం జి నుంచి 550 ఎంజి మధ్య మద్యం శాతం నమోదైంది. వీరిందరినీ త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదం చేస్తే పదేళ్ల జైలు!

మద్యం మత్తులో వాహనం నడిపి ఎవరి ప్రాణాలకైనా ముప్పు కలిగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డీసీపీ హెచ్చరించారు. కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 105 ప్రకారం కేసు నమోదు చేస్తామని, నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా తప్పదని స్పష్టం చేశారు.

గత వారం తీర్పులు ఇవే..

మార్చి 15 నుంచి 21 వరకు మొత్తం 128 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కోర్టులో పరిష్కారమయ్యాయి. 

ఇందులో:120 మందికి జరిమానా విధించగా..08 మందికి జరిమానాతో పాటు సామాజిక సేవ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.