10 May, 2026 | 10:19 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

నేటి నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లలో ట్రాఫిక్ మళ్లింపులు

27-02-2026 12:00 AM

బంజారాహిల్స్,ఫిబ్రవరి 26(విజయక్రాంతి): నగరంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చేపట్టిన హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనుల దృష్ట్యా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రా ఫిక్ పోలీసులు ప్రకటించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, ముగ్ధ జంక్షన్ వద్ద జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మా ణాల్లో భాగంగా ఫిబ్రవరి 27 నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లో పిల్లర్ పను లు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ముగ్ధ జంక్షన్ నుంచి చెక్ పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ మళ్లింపుల్లో భాగంగా ఎన్‌ఎఫ్సీఎల్ నుంచి వచ్చే వాహనాలను శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్ వద్ద మళ్లించి ఇందిరా నగర్ లేబర్ అడ్డా, వెంకటగిరి మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు పంపిస్తారన్నారు.

అలాగే రోడ్ నెం. 36, 45 నుంచి ఎన్‌ఎఫ్సీఎల్ వైపు వెళ్లే వారు యూసుఫ్ గూడ బస్తీ, మైత్రీవనం మీదుగా ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. కేసీపీ, మాసబ్ ట్యాంక్ వైపు నుంచి వచ్చేవారు రోడ్ నెం. 10, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదు గా జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 వైపు వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉదయం 8:30 నుంచి 11:00 వరకు, సాయంత్రం 5:00 నుంచి రాత్రి 9:00 వరకు రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో ఈ మార్గాల్లో ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. హెల్ప్‌లైన్ నంబర్ 90102 03626కు సంప్రదించాలన్నారు.