10 May, 2026 | 6:13 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం

10-05-2026 05:09 PM

మద్నూర్,(విజయక్రాంతి): మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన దరాస్ సాయిలును మండల పరిధిలోని కాంగ్రెస్ ప్రముఖ నాయకులు ఆదివారం ఘన సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమం అవల్ గావ్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామ అధ్యక్షుడు, ప్రమోద్ పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ క్రమంలో అవల్గాం గ్రామ  వార్డ్ మెంబర్లు, మారుతి కిసర్ వార్, రాజప్ప, యాదవ్ బొండ్లవార్, వార్డ్ మెంబర్ భర్త దీప యాదవ్,  కాంగ్రెస్ నాయకులు వినోద్ పటేల్, కైలాష్ మహంత్వార్, బాబు పటేల్, పుండ్లిక్,గొళ్ళెవార్ విట్టల్, మ్యాకలవార్ హన్మండ్లు, లక్ష్మణ్,చిక్కల్ వార్ ధనరాజ్ లు సన్మానించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,రాష్ట్ర ప్రభుత్వ హై కమాండ్ తనపై నమ్మకంతో  రెండోసారి అధ్యక్షునిగా నియమించడం, మండల బాధ్యతలు  తనకు అప్పగించడం,తనపై మరింత బాధ్యత పెరిగిందని మద్నూర్ మండలంలో ఉన్న  అన్ని గ్రామాల్లో పార్టీ బలోపేతానికి  కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండ గంగాధర్  తదితరులు పాల్గొన్నారు. వీరందరికీ  మండల అధ్యక్షులు   ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.