10 May, 2026 | 9:10 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

మార్చి 1 నుంచి రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలు

27-02-2026 12:00 AM

డీబీపీ జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్

ముషీరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): దేశ సంపద, ప్రజల ఆస్తులను అంబానీ, ఆదానిలకు అమ్మేస్తున్న దేశ ద్రోహులు బీజేపీ కేంద్ర సర్కార్ మోడీషా మనువాదుల పాలన నుంచి రాజ్యాంగాన్ని, దళిత బహుజనులను రక్షించికోవాలని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుని చ్చారు. ఇదే నినాదంతో మార్చి 1 నుంచి జూన్ 30 వరకు దేశ వ్యాప్తంగా జరిగే రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలను విజయవంతం చేయాలని కోరారు.

గురువారం హిమాయత్ నగర్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో  ఆయన మాట్లాడుతూ ఈ సందర్బంగా ప్రజలు ఎదురుకుంటున్న పలు జీవ న, ఆర్ధిక, సామాజిక సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్యాలపై ఆందోళన ద్వారా వత్తిడి తెస్తామన్నారు.

అంబేద్కర్ సమత రాజ్యాంగం స్థానంలో మనువాద బ్రాహ్మణ దోపిడీ రాజ్యాంగాన్ని తీసుకొని రావడానికి బీజేపీ సర్కార్ సిద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు డా.వి.ఎల్.రాజు, జె.ఎన్.రావు, ఎన్.రాంచందర్, నీరటి శంకర్, పి.రాజలింగం, గంధం శంకర్, పిట్ల ఈశ్వర్, దాసరి నిచ్చికోల, జైరాజ్ తదితరులు పాల్గొన్నారు.